Oct 15, 2020

*ఉద్యోగుల కరోనా వైద్య ఖర్చులకూ రీయింబర్స్ మెంటు* *ఆరోగ్యశ్రీ మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ* *ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక వెల్లడి* (ఉద్యోగులు న్యూస్) *కరోనా వైద్యం సమయంలో ఉద్యోగుల ఆరోగ్య కార్డులు నిరాకరించినందున ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సుముఖత వ్యక్తం చేశారని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక వెల్లడించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత వారు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్య వేదిక ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, జోసెఫ్ సుధీర్ బాబు,జి. హృదయరాజు తదితరులు ఈ విషయం వెల్లడించారు* *ఉద్యోగులకు కరోనా సమయంలో ఆరోగ్య కార్డులు నిరాకరించి వైద్యం అందించని నెట్ వర్కు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఐక్య వేదిక నేతలు బండి శ్రీనివాసరావు, షేక్ సాబ్జి, జి.హృదయరాజు, సోమేశ్వరరావు తదితరులు సమావేశానికి ముందే ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను క్రోడీకరించారు. వీటిని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జునరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.* *ఐక్య వేదిక డిమాండు చేయగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి* *కోవిడ్-19 చికిత్స లో కార్డులను నిరాకరించి డబ్బులను దండుకొన్న ఆసుపత్రులపై చర్యలు.* *కార్డులపై వైద్యం నిరాకరించినందున ఉద్యోగులకు ఆ మొత్తం రికవరీ చేసేందుకు పరిశీలన.* *మెడికల్ రియింబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వులు త్వరలో జారీ చేసేందుకు హామీ. కోవిడ్ కు వర్తించేందుకు పరిశీలన* *ఉద్యోగుల ఆరోగ్య కార్డుల నిబంధనల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఎయిడెడ్ , మోడల్ స్కూల్, గురుకుల విద్యాలయాలు, గ్రంథాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో కొత్త కార్డుల జారీ* *పెండింగ్ లో ఉన్న 3,800 మెడికల్ బిల్లులను త్వరలో మంజూరుకు హామీ.* *విద్యా శాఖలో మెడికల్ రియింబర్స్మెంట్ ప్రక్రియ త్వరలో సులభతరం చేసేందుకు హామీ* *గతంలో కాలిపోయిన మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు 212 లో ప్రస్తుతానికి 65 వరకు మంజూరుకు సానుకూలం.* *ఉభయగోదావరి జిల్లాల్లోని 7 మండలాల్లోని టీచర్లకు ఆరోగ్య కార్డుల జారీకి ప్రక్రియ వేగవంతం చేస్తామని మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ లభించిందని జేఏసీ పేర్కొంది.*