Oct 10, 2020

*55 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ తక్షణం అమలు చేయాలి* *మళ్లీ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు తగదు* *JAC ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్* *రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీ ఆర్సీలో 55శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, తక్షణం ఎలాంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వైదిక (JAC)ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2018 జులై నుంచి నివేదిక అమలు చేయాలని కోరారు. ఇప్పటికే వేతన సవరణ సంఘం నివేదిక ఇవ్వడంలోనే ఆలస్యమైందని, అమలు చేయడానికి ఇంకా సమయం తీసుకోవద్దని ఆయన కోరారు.అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 11వ వేతన సంఘంపై మరో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నారని, లీకులు వస్తున్నాయని, అలాంటి ప్రయత్నాలు తగవని అన్నారు. వేతన సవరణ కమిషన్ తన నివేదిక ఇవ్వడానికి 27 నెలల కాలం పట్టిందని ఆయన గుర్తు చేశారు. చాలా మంది పదవీ విరమణ చేసే వారు పీఆర్సీ అమలు ఆలస్యం వల్ల నష్టపోతారని కూడా మేం ప్రభుత్వానికి తెలియజేస్తునానమని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.ప్రభుత్వం బకాయిగా ఉన్న డీఏలను కూడా తక్షణమే ఇవ్వాలని కోరారు.*