Oct 3, 2020

పెండింగు జీతాలు, డీఏలు, పీఆర్సీ... సీపీయస్.... 5 అంశాలపై ముఖ్యమంత్రి టీం దృష్టి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు షురూ కొన్నయినా కొలిక్కి వచ్చే అవకాశం (సోషల్ మీడియా సమాచారం) ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ఇప్పుడు ఒక్క విషయం సుస్పష్టమయింది. ఉద్యోగులకు సంబందించిన కీలకాంశాలపై ముఖ్యమంత్రి టీం దృష్టి సారించింది. ఆవైపుగా ఆ బృందం మథనం చేస్తోంది. పెండింగు జీతాలూ, కరవు భత్యం అమలూ, పీఆర్సీ, సీపీఎస్ రద్దూ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ఆలోచన చేస్తోంది. ఏదో ఒక కార్యాచరణ వైపు అడుగులు వేయబోతోంది. కనీసం కొన్ని అంశాలైనా పరిష్కారం దిశగా అడుగులు పడబోతున్నాయి. ఈ టీం తుదిరూపు ఇచ్చిన నివేదిక మంగళవారం ముఖ్యమంత్రి వద్ద చర్చకు రానుంది. ఉద్యోగులకు సంబంధించిన సంఘాల నేతలు గురువారం సీఎం కార్యాలయాని వెళ్లి వచ్చిన తర్వాత వారు చెప్పిన సారాంశం అంతా ఇదే. ఆర్థికశాఖ అధికారులు ఇందుకోసం మార్గ సూచి సిద్ధం చేస్తున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటీవల వెల్లడయింది. ఇప్పుడు ఆ వార్త నిజం కాబోతోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి రావత్ తదితరులు ఉద్యోగుల ఆర్థిక అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలో కొంత కసరత్తు చేసినట్లు సమాచారం. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ సైతం మూడు నాలుగు సమావేశాలు నిర్వహించి సమచారాన్ని క్రోడీకరించింది. ఆ కమిటీలోన ఆర్థికశాఖ అధికారులు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇందులోని లోటు పాట్లు, సవాళ్లు, ఎలా అమలు చేయాలి తదితర అంశాలపై కూడా కొన్ని కీలకాంశాలను కొలిక్కి తీసుకువచ్చారు. మరో వైపు పెండింగు జీతాల చెల్లింపు, కరవు భత్యాల అమలు, పీఆర్సీ విషయంలో వివిధ కాంబినేషన్లలో వీటిని ఎలా ఎప్పుడు అమలు చేస్తే ఎంతభారం పడుతుంది, ఆర్థికంగా ప్రభుత్వం భరించాల్సి వచ్చేదెంత అనే కోణంలో సమాచారం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయకల్లాం, సత్యానారాయణ వంటి వారు ఇప్పటికే కొన్ని అంశాలపై అవగాహనకు వచ్చినట్లు సమాచారం. మంగళవారం (అక్టోబరు 6) ముఖ్యమంత్రి జగన్ వద్ద ఈ టీం సమావేశమై ఆయనకు నివేదించే అవకాశం ఉంది. మంగళవారం కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రికి ఒక కీలక సమావేశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత సమాచారం మేరకు ఉద్యోగుల అంశాలపై కూడా జగన్ కు ప్రజంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి టీం తమ ఆలోచనలు ఆయనతో పంచుకుంటారు. అక్కడ జరిగే చర్చలో ముఖ్యమంత్రి సలహాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఒకే రోజు ఉద్యోగుల సంఘాల నేతలూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి అవే 5 అంశాలపై డిమాండ్ చేయడం విశేషం. రెండు సంఘాలకూ ఒకే రోజు వారిని కలిసే అవకాశం రావడమూ గమనార్హం. దీని ద్వారా ఉద్యోగులకు కొంత సానుకూల వర్తమానం పంపే ప్రయత్నం అధికారికంగా ఏమైనా జరిగిందా అన్న చర్చ కూడా సాగుతోంది. -సన్నశెట్టి , ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు, 94404 36703